దసరాను టార్గెట్ చేసిన ‘దేవర’ !

18
- Advertisement -

 యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. ఈ మూవీ కోసం ఇటు తెలుగు ఆడియన్స్ తో పాటు అటు నార్త్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని మొదట ఏప్రెల్ 5న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అన్నీ అనుకున్నట్లు జరిగివుంటే ఈపాటికే దేవర ప్రమోషన్స్ ఓ రేంజ్ లో స్టార్ట్ అయ్యేవి. కానీ అలా జరగలేదు. గత కొన్ని రోజులుగా దేవర పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు తెర వైరల్ అయ్యాయి. కానీ ఆ వార్తలను చిత్ర యూనిట్ కన్ఫమ్ చేయలేదు. అలాగని ఖండించలేదు.

దీంతో అసలు దేవర రిలీజ్ పై ఎందుకీ కన్ఫ్యూజన్ అంటూ అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. .అయితే దేవర రిలీజ్ డేట్ న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించడంతో దేవర పోస్ట్ పోన్ పై వస్తున్న వార్తలు నిజమే అనే అంచనాకు వచ్చారంతా. ఇక పోస్ట్ పోన్ పై వస్తున్న వార్తలను నిజం చేస్తూ తాజాగా రిలీజ్ వాయిదా ను అధికారికంగా కన్ఫర్మ్ చేస్తూ చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. దేవర పార్ట్ 1 మూవీ ఈ ఏడాది అక్టోబర్ 10 దసరా కానుకగా రిలీజ్ కాబోతుందని చిత్రా యూనిట్ ప్రకటించింది. దీంతో దసరా బరిలో ప్రస్తుతానికి ఎన్టీఆర్ ఒక్కడే కన్ఫర్మ్ కావడంతో వేరే హీరోల సినిమాలు దసరా బరిలో నిలిచే సాహసం చేస్తాయా ? అనేది డౌటే.

ఇకపోతే ఈ ఈ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే మొదటి భాగాన్ని ఇదే ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేసి 2025 లో పార్ట్ 2 ను రిలీజ్ చేసేలా చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోందట. ఇక ఈ మూవీని కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ మూవీగా కొరటాల రూపొందిస్తున్నారు. గత సినిమా ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడంతో దేవర విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పక్కాగా హిట్ కొట్టే కాన్ఫిడెన్స్ తో కొరటాల ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎన్టీఆర్, కొరటాల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read:పదేళ్ళు సి‌ఎం.. రేవంత్ ఓవర్ కాన్ఫిడెన్స్?

- Advertisement -