ప్చ్.. రిస్క్ చేస్తున్న ఎన్టీఆర్ !

28
- Advertisement -

ఆ బాలీవుడ్ జనంతో మెలగడం, వారి ముందు సమర్థవంతంగా నెగ్గుకు రావడం చాలా కష్టం. ఇప్పటికే ఈ విషయం ప్రభాస్ కి చాలా స్పష్టంగా అర్ధం అయ్యింది. అందుకే, ఎట్టిపరిస్థితుల్లో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయాలని ఎన్ని మల్టీస్టారర్ ఆఫర్స్ వచ్చినా.. ప్రభాస్ వాటి జోలికి పోవడం లేదు. ఓ దశలో చరణ్ కి కూడా మల్టీస్టారర్ ఆఫర్లు వచ్చాయి. అయినా, చరణ్ కూడా వాటికి సున్నితంగా నో చెప్పేశాడు. అలాగే, బాలీవుడ్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి మహాభారతం ఆధారంగా రచించిన పర్వ అనే పుస్తకాన్ని సినిమా రూపంలో అందించనున్నారు. ఇందులో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ఓ పాత్రలో నటిస్తే బాగుంటుందంటూ అతన్ని అప్రోచ్ అయ్యాడు. యశ్ కూడా నో చెప్పేశాడు.

ఇందరు నో చెప్పినా.. ఒక్కడు మాత్రం బాలీవుడ్ మల్టీస్టారర్ చిత్రాలకు యస్ చెబుతూ వస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్‌’తో గ్లోబల్ స్టార్‌ గా మారిపోయిన జూ.ఎన్టీఆర్.. హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమా చేయబోతున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య జరిగే పోరాటంగా వార్ 2 రూపొందించనున్నారని తెలుస్తోంది. పైగా ఎన్టీఆర్ తో గత 5 నెలలుగా చర్చలు జరిపారు. ఎన్టీఆర్ ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాత.. తన మిత్రుడు కొరటాల శివను కూడా స్క్రిప్ట్ లో ఇన్ వాల్వ్ చేసి.. తన పాత్ర పై పూర్తి క్లారిటీ తర్వాతే ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ నడిచింది. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదు.

కాకపోతే, సినిమాలో హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉండనుందని అంటున్నారు. కానీ నమ్మేది ఎలా ?, హృతిక్ రోషన్ అక్కడ స్టార్ హీరో. పైగా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ పాత్ర చాలా బలంగా ఉంటుంది. మరి ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది ?, కచ్చితంగా హృతిక్ పాత్రకు సమానంగా అయితే ఉండదు. అలాంటప్పుడు ఎన్టీఆర్ ఈ సినిమా చేయడం తన కెరీర్ రిస్క్ నే కదా. ఈ సినిమాకు అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఎన్టీఆర్ ను అద్భుతంగా చూపిస్తా అని చెబుతున్నా.. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఏది ఏమైనా ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడు.

Also Read:లవంగాలతో ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -