కల్యాణ్… తప్ప ఎవరు న్యాయంచేయలేరు: ఎన్టీఆర్

57
sagar
- Advertisement -

ఈ సినిమాకు కల్యాణ్ రామ్ తప్ప ఎవరూ న్యాయంచేయలేరన్నారు నటుడు జూనియర్ ఎన్టీఆర్. కల్యాణ్‌ రామ్‌ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్‌ హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘బింబిసార’. వశిష్ఠ్‌ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. శుక్రవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ… కొత్త దర్శకుడైనా సినిమాను చాలా అద్భుతంగా తీశాడు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతారన్నారు. అందరూ ఇండస్ట్రీకి గడ్డు కాలం అని, థియేటర్లకి జనాలు రావడం లేదని, ఇంకా ఏవేవో అంటున్నారు. ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన మంచి సినిమా వస్తే చూసి, ఆశీర్వదించే గొప్ప హృదయం ఉన్న తెలుగు ప్రేక్షక దేవుళ్లు మీరంతా అన్నారు.

బింబిసార అద్భుతమైన సినిమా…. మా తాత , మా నాన్న మాకు వదిలి వెళ్లిన అభిమానులు మీరు, మీకు జీవితాంతం రుణపడి ఉంటాం అన్నారు. కల్యాణ్‌ అన్న కెరియర్‌ బింబిసారకి ముందు, తర్వాత అని కచ్చితంగా చెప్తాను అన్నారు.

- Advertisement -