Jr NTR:ఎన్టీఆర్ రెమ్యునరేషన్ అంతేనా?

39
- Advertisement -

‘ఆర్ఆర్ఆర్‌’తో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన జూ.ఎన్టీఆర్.. హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు జూ.ఎన్టీఆర్ రూ.30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు టాక్ నడుస్తుంది. దీంతో ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఏది ఏమైనా హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ కలిసి నటిస్తే.. ఆ కిక్కే వేరు.

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ ‘వార్-2’ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్స్ గా హృతిక్ కి – ఎన్టీఆర్ కి పేరు ఉంది. అలాంటి వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే.. కచ్చితంగా పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవుతుంది. పైగా హృతిక్‌ తో క‌లిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటే.. ఎన్టీఆర్‌కు గ్రాండ్ గా బాలీవుడ్ ఎంట్రీ ద‌క్కినట్టే.

అలాగే హృతిక్ కి కూడా గ్రాండ్ గా సౌత్ ఎంట్రీ ద‌క్కినట్టే. కాగా, ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తుండగా.. హృతిక్ ఫైటర్ లో యాక్ట్ చేస్తున్నాడు. అన్నట్టు ఎన్టీఆర్ పై ప్రస్తుతం కొరటాల శివ పలు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -