హెల్త్‌ యూనివర్శిటీ పేరుపై స్పందించిన జూ.ఎన్టీఆర్‌

124
ntr
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు. విజయవాడ కేంద్రంగా ఉన్న ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్న ఏపీ ఆసెంబ్లీలో దీనిపై సవరణ బిల్లును తీసుకువచ్చిన జగన్‌ సర్కార్‌ ఆమేరకు బిల్లును ఆమోదింపజేసుకున్నది. దీంతో ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం కాస్తా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారింది.

హెల్త్‌ యూనివర్శిటీ పేరును మార్చడంపై జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘ఎన్టీఆర్‌, వైఎస్సార్‌ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించుకున్న గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా వచ్చే గౌరవం వైఎస్సార్‌ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్‌ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్‌ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు అని పేర్కొన్నారు. నెటిజెన్లు ఈ ట్వీట్‌ను ఇప్పటివరకు 10 వేలకు పైగా రీట్వీట్‌ చేసి తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు.

- Advertisement -