ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. సినిమా చక్కగా ఉందని సినీ ప్రముఖులు, విమర్శకులు ఎన్టీఆర్, చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆనందంతో ట్విటర్లో స్పందించారు. ఓ నటుడిగా దీనికి మించి ఇంకేమీ అడగనని అన్నారు.
జై లవకుశపై మీరు చూపిన ప్రేమ చాలా సంతృప్తిని ఇచ్చింది. ఓ నటుడిగా.. దీని కన్నా ఉత్తమమైనది ఏమీ అడగను. అందరికీ ‘జై లవకుశ’ చిత్ర బృందం నుంచి ధన్యవాదాలు’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
తొలి రోజు ఈ సినిమా భారత్లో సుమారు రూ. 24 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే అమెరికాలో మొన్నటి ప్రీమియర్ షో రూ. 3.64 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ కెరీర్లో అత్యధిక మొత్తంలో ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న సినిమాగానూ ‘జై లవ కుశ’ నిలిచిపోతుందని ఉమెయిర్ సంధు తన ట్వీట్లో పేర్కొన్నాడు.
ఓవర్సిస్లో సైతం జై లవకుశ భారీ వసూళ్లను రాబడుతోంది. ఓవరాల్గా ఇప్పటివరకు 5,89,390 డాలర్లు అని తరణ్ ట్వీట్ చేశాడు. భారత కరెన్సీలో 4.76 కోట్ల రూపాయలు రాబట్టింది.