‘ఆర్ఆర్ఆర్’ తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్ కి మంచి గుర్తింపు వచ్చినా.. ఎన్టీఆర్ లుక్ పై మాత్రం బాగానే నెగిటివ్ టాక్ నడిచింది. ఆ మాట కొస్తే చాలా ఏళ్లుగా లుక్ విషయంలో ఎన్టీఆర్ తీవ్రవిమర్శల పాలవుతున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో కొత్తదనం చూపించిన ఎన్టీఆర్, ఆ తర్వాత చేసిన సినిమాల్లో లుక్ విషయంలో ఫాన్స్ ని, ప్రేక్షకులని డిస్పాయింట్ చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో వస్తోన్న దేవర లుక్ పై మొదట్లో బాగా ఆసక్తి కలిగింది. కానీ, దేవర లుక్ కూడా ఎన్టీఆర్ రెగ్యులర్ లుక్ లాగే ఉండటంతో ఫ్యాన్స్ బాగా నిరాశ పడ్డారు.
ఐతే, వార్ 2 మాత్రం ఎన్టీఆర్ ను సరికొత్తగా చూపించబోతుంది. మాస్ లుక్ లో ఫాన్స్ ని ఇంప్రెస్స్ చేయడానికి ఎన్టీఆర్ ఇప్పుడు వెరీ స్టైలిష్ లుక్ లోకి మారబోతున్నాడు. ముఖ్యంగా వార్ 2 లో ఎన్టీఆర్ చాలా హ్యాండ్ సమ్ లుక్ లో కనిపించి ఫిదా చేస్తాడని అంటున్నారు. తారక్ లుక్ మెస్మరైజ్ చేస్తుందని.. కచ్చితంగా ఎన్టీఆర్ కొత్త లుక్ చూసి ఇలా కదా మేము ఎన్టీఆర్ ని చూడాలనుకుంది అంటూ ‘ఎన్టీఆర్ ఫ్యాన్స్’ గొప్పగా మాట్లాడుకుంటారు అంటూ మేకర్స్ కూడా నమ్మకంగా చెబుతున్నారు. మొత్తానికి వార్ 2 పుణ్యమా అని ఎన్టీఆర్ లుక్ పూర్తిగా మారబోతుంది అన్నమాట.
ఇక జూ.ఎన్టీఆర్.. హృతిక్ రోషన్ తో కలిసి ఈ వార్ 2 సినిమా చేయబోతున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ మూవీ 2025 జనవరి 24న రిలీజ్ కానున్నట్టు సమాచారం. మొత్తానికి హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ కలిసి నటిస్తే.. ఆ కిక్కే వేరు. ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్స్ గా హృతిక్ కి – ఎన్టీఆర్ కి పేరు ఉంది. అలాంటి వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే.. కచ్చితంగా పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవుతుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాలను నమోదు చేస్తోందో చూడాలి.
Also Read:బ్రేకింగ్..ట్రంప్‌కు బిగ్ షాక్