ఎన్టీఆర్-నీల్.. రిలీజ్ డేట్ ఫిక్స్!

23
- Advertisement -

టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డ్రాగన్ వర్కింగ్ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతుండగా ప్రస్తుతం కర్ణాటకలో దర్శకుడు ప్రశాంత్ నీల్ పర్యవేక్షణలో షూటింగ్ జరుగుతోంది.

ఈ భారీ యాక్షన్ డ్రామా చిత్రానికి సంబంధించి విడుదల తేదిని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయనున్నారు.

అంతేకాకుండా, ఎన్టీఆర్ పుట్టినరోజు 2025 మే 18న, ఈ మూవీకి సంబంధించిన ఒక స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్‌ను కథానాయికగా దాదాపుగా ఖరారు చేశారు. అలాగే ప్రకాష్ రాజ్, ప్రభాస్ శ్రీను తదితరులు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు.

Also Read:అలా అయితే పాకిస్తాన్‌కే వెళ్లండి:పవన్

- Advertisement -