భారీగా పెరిగిన ఎన్టీఆర్ మార్కెట్

33
- Advertisement -

‘జూనియర్ ఎన్టీఆర్’ ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్, అరవింద సమేత వీర రాఘవ, జై లవకుశ, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, టెంపర్’ ఇలా వరుస హిట్ ల తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారడం కాదు.. ఎన్టీఆర్ రూటు కూడా మార్చేశారు. ఒకపక్క తెలుగులో, మరోపక్క హిందీలో నటిస్తూ ఎన్టీఆర్ క్రేజీగా మారిపోయారు. వరుస హిట్స్ తో పాటుగా వరుసగా యాడ్ షూట్స్ కూడా ఎన్టీఆర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కి మార్కెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.

మొత్తానికి ఎన్టీఆర్ రేంజ్ పూర్తిగా మారిపోయింది అని నందమూరి ఫాన్స్ కూడా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా, ఎన్టీఆర్ సినిమాల మర్కెట్ అదే రేంజ్ లో పెరిగిపోయింది. తాజాగా ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ‘దేవర’ మూవీ బడ్జెట్ 500 కోట్ల పైనే మాటే అంటున్నారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒకప్పుడు ఎన్టీఆర్ పై అంత బడ్జెట్ పెట్టాలంటే నిర్మాతలకి ఒక విధమైన కంగారు ఉండేది. కానీ ఈ మధ్యన ఎన్టీఆర్ స్పీడ్ చూసి నిర్మాతలు ధైర్యం గా తారక్ పై కోట్ల బడ్జెట్ కురిపిస్తున్నారు.

థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కిందే 500 కోట్ల వరకు కవర్ అవడంతో నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. కొరటాల శివ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తారని, అలాగే, దర్శకుడు అట్లీతో ఓ భారీ సినిమా చెయ్యబోతున్నారు. ప్రస్తుతం వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ డేట్స్ కేటాయించిన సంగతి తెలిసిందే.

Also Read:వైసీపీ క్లారిటీ.. రాజధాని ‘అమరావతే’!

- Advertisement -