టిల్లు కోసం వస్తున్న దేవర!

15
- Advertisement -

2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భారీ అంచనాలతో మార్చి 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటివరకు రూ.95 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

ఇక ఈ సినిమా సక్సెస్ మీట్‌ని ఏప్రిల్ 8న నిర్వహించనున్నారు. తమ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్ కి ఎన్టీఆర్ ప్రత్యేక అతిధిగా వస్తున్నట్టు సితార ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలు..

- Advertisement -