సీతగా సాయిపల్లవి.. రావణుడిగా ఎన్టీఆర్

69
- Advertisement -

రామాయణం ఆధారంగా ప్రభాస్, కృతి సనన్ జంటగా తెరకెక్కిన ఆదిపురుష్ విడుదలకు సిద్దమవుతున్న వేళ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా మరో రామాయణం తెరకెక్కనుందట. ఈ కొత్త ప్రాజెక్ట్ ను బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ డైరెక్ట్ చేయనున్నాడని సమాచారం. ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా.. రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కనిపించనున్నారని తెలుస్తోంది.

అయితే, ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. మరోపక్క ఈ చిత్రం కోసం రామాయణంలోని ఏ పాయింట్ ను తీసుకుంటారు అనేది సస్పెన్స్ గానే ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏది ఏమైనా రావణుడి పాత్రలో హృతిక్ రోషన్ అంటే.. నిజంగా షాకింగ్ విషయమే. ఒక సూపర్ స్టార్ రేంజ్ అయ్యి ఉండి… హృతిక్ రోషన్ రావణుడి పాత్రను ఎందుకు చేస్తాడు?, ఇది ఫేక్ న్యూస్ అని కొందరు కొట్టి పారేస్తున్నారు.

Also Read:నిరాశలో ప్రగ్యా.. కారణం అదే

మరోవైపు రావణుడి పాత్రలో హృతిక్ రోషన్ కంటే కూడా.. జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుంటుంది అని మరికొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ కూడా రావణుడి పాత్రలో నటించి మెప్పించారు. పైగా జైలవకుశ సినిమాలో కూడా తారక్ రావణుడి పోలిన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. కాబట్టి.. రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా జూనియర్ ఎన్టీఆర్ అయితే బెస్ట్ అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:బత్తాయి రసం తాగుతున్నారా.. ఇవి తెలుసుకోండి!

- Advertisement -