మహేష్ పై ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం..

202
Mahesh Babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు సాధారణంగా ఎలాంటి వివాదాల్లోనూ తలదూర్చే ప్రయత్నం కాదు కదా కనీసం దరిదాపుల్లోకి వెళ్లే సాహసం కూడా చేయడు. ఆ శైలే ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడింది. కానీ ఎంత స్టార్ అయినా సోషల్ మీడియా మేనేజ్ మెంట్ లో ఏమరుపాటుగా ఉంటే మాత్రం విమర్శలు తప్పని పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇటీవల ‘సర్కార్’ చిత్రం విషయమై మహేష్ బాబు చేసిన ట్వీట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ‘సర్కార్’ చిత్రాన్ని చూసిన మహేశ్.. ఈ పొలిటికల్ డ్రామా ఎంగేజింగ్‌గా ఉందని.. ఆద్యంతం ఎంజాయ్ చేశానని.. మురుగదాస్ ట్రేడ్ మార్క్ ఫిల్మ్ ‘సర్కార్’ అంటూ ట్వీట్ చేశారు.

Mahesh Babu

అయితే ఈ ట్వీట్ తారక్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీనికి కారణం ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ చిత్రం. ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమాపై మహేష్ అసలు స్పందించలేదు. ఇది తారక్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. అనువాద చిత్రం ‘సర్కార్’ విషయంలో వెంటనే స్పందించిన మహేష్.. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘అరవింద సమేత’ విషయమై స్పందించకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.

‘సర్కార్’ డైరెక్టర్ మురుగదాస్‌తో సినిమా చేశారు కాబట్టి మహేష్ స్పందించారనుకున్నా.. ‘అరవింద సమేత’ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కూడా సినిమా చేశారు కదా, ఆ విధంగానైనా మహేష్ స్పందించి ఉండొచ్చు కదా? అని సామాజిక మాధ్యమాల వేదికగా తారక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -