- Advertisement -
మంగళవారం టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ కుటుంబం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ దర్శనంలో ఎన్టీఆర్ తల్లి శాలిని భార్య లక్ష్మీ ప్రణతి పిల్లలు అభయ్ రామ్ భార్గవ్ రామ్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. కాగా,జూనియర్ ఎన్టీఆర్ తన పిల్లలు భార్యను సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతారు. వారి ఫొటోలు తరుచుగా బయటకు రావు. ఈ క్రమంలోనే తిరుమలకు ఎన్టీఆర్ కుమారులు ఇద్దరూ రావడంతో వారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
- Advertisement -