‘గని’ థియేట్రికల్ ట్రైలర్‌ వచ్చేస్తోంది..

86
- Advertisement -

టాలీవుడ్‌ హీరో వరుణ్ తేజ్ కథనాయకుడిగా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ మార్చి 17న ఉదయం 10:30 లకు విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ గంటల తరబడి జిమ్ లో వర్కవుట్స్ చేసి ఎయిట్ ప్యాక్ కూడా బిల్డ్ చేశాడు. ఇందులో వరుణ్ మేకోవర్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పిస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్‌ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుండగా.. జగపతి బాబు, ఉపేంద్ర, నవీన్ చంద్ర, నదియా, నరేష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.అల్లు బాబీ, సిద్ధూ ముద్ద సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -