Jr NTR:కొత్త బిజినెస్‌లోకి ఎన్టీఆర్!

28
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్..టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరు. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు జూనియర్. రెండు పార్టులుగా ఈ సినిమా తెరకెక్కుతుండగా తొలిపార్టు దసరాకు ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఓ వైపు సినిమాలు మరోవైపు యాడ్స్‌తో బిజీగా ఉండే తారక్..తాజాగా కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఓ ఓటీటీ సంస్థ ఎన్టీఆర్‌కు అదిరే ఆఫర్ ఇచ్చిందట. ఎన్టీఆర్‌తో ఓ అదిరే టాక్‌ షోకు ప్లాన్ చేయగా దీనికి హోస్ట్‌గా ఉండాలని కోరారట. అంతేగాదు షోకు రెమ్యునరేషన్ లేదా ఓటీటీలో పార్ట్‌నర్ షిప్ ఇస్తామని చెప్పారట. దీనిపై త్వరలోనే ఎన్టీఆర్ వైపు నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఉండనుందట.ఇక కొరటాల శివతో సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు ఎన్టీఆర్.

ఇప్ప‌టికే మ‌హేష్ బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అల్లు అర్జున్ థియేట‌ర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ సాధించారు. అయితే తారక్ మాత్రం భిన్నంగా ఓటీటీలోకి ఎంటర్‌ అవుతున్నారు.

Also Read:బోయపాటి – బాలయ్య..అప్‌డేట్!

- Advertisement -