ఎన్టీఆర్ కి మరో ఘనత.. దేవర పై క్రేజీ అప్ డేట్

65
- Advertisement -

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ప్ర‌స్తుతం కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జాన్వీ క‌పూర్ ఈ సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌యం కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ బ‌జ్ వినిపిస్తోంది. న్యూ ఇయ‌ర్ రోజున దేవ‌ర‌కు సంబంధించిన ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయ‌నున్నార‌ని, దాంతో పాటే టీజ‌ర్ అప్డేట్‌ను కూడా ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇందులో నిజ‌మెంత‌న్న‌ది తెలియాల్సి ఉంది. మరోవైపు ఎన్టీఆర్ కి మరో అరుదైన ఘనత దక్కింది. ‘ఏషియన్‌ వీక్లీ’ విడుదల చేసిన ఆసియాలో 2023 టాప్‌ 50లో చోటుదక్కించుకున్నారు.

ఈ జాబితాలో షారుక్‌ ఖాన్‌ తొలి స్థానంలో నిలవగా, ఎన్టీఆర్ 25వ స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే, తెలుగు సినిమా నుంచి ఎన్టీఆర్ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ 31వ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా కూడా కేజీఎఫ్, స‌లార్‌ లాగే రెండు భాగాలుగా రానుంద‌ని స‌మాచారం. వీలైనంత త్వ‌ర‌గా స‌లార్ 2ను పూర్తి చేసి, ఎన్టీఆర్ సినిమాను సెట్స్‌కు తీసుకెళ్లాల‌ని చూస్తున్నాడ‌ట ప్ర‌శాంత్ నీల్.

ఇక ‘దేవర’ విషయానికి వస్తే.. దేవర సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్ గా, మరో భామ కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు స్టైలిష్ విలన్ గా కనిపించబోతున్నారు. అలాగే సైఫ్ అలీఖాన్ మరో ప్రధాన విలన్ గా నటిస్తున్నాడు. అన్నట్టు ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. దేవర ఫస్ట్ పార్ట్ 1 ఎండింగ్ లో నిజమైన దేవర (ఓల్డ్ ఎన్టీఆర్) ను రివీల్ చేసి.. సీక్వెల్ లో ఆ ఓల్డ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీక్వెల్ ను నడపాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు.

Also Read:నెలసరి సమస్యలకు..పరిష్కారం!

- Advertisement -