ఎన్టీఆర్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు?

34
- Advertisement -

‘వార్ 2’ లో ఎన్టీఆర్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడా ?, నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించే వార్తే. ఎన్టీఆర్ కి ఉన్న ఇమేజ్ ముందు విలన్ రోల్ అంటే అది కచ్చితంగా తారక్ స్థాయికి సరితూగదు. మరెందుకు ఎన్టీఆర్ వార్ 2 చేయడానికి ఒప్పుకున్నాడు. సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ మూవీ ఎండింగ్ లో ‘వార్ 2’ గ్లింప్స్ ను ఆడియన్స్ కు చూపించారు. అందులో హృతిక్ రోషన్ కి ఒక వ్యక్తి విలన్ గురించి చాలా వైల్డ్ గా చెప్పాడు. ఆ మాటలు విలన్ గురించే. వార్ 2 లో హృతిక్ రోషన్ హీరో అని తేలిపోయింది. మరి రెండో కీలక పాత్ర అంటే ఇక మిగిలింది విలన్ పాత్రే.

ఆ విలన్ గురించి చెప్పిన మాటలే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. “ఇండియాకు ఒక కొత్త శత్రువు తయారయ్యాడు. ఇప్పటివరకు ఎవరు చూడని అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. అతడు ఎలా ఉంటాడో తెలియదు. పేరు కూడా తెలియదు. పూర్తిగా చీకట్లో ఉంటాడు. అతన్ని ఎదుర్కోవాలంటే నువ్వు కూడా చీకట్లోనే వెళ్లాలి. అతనితో పోరాటం మరణం కంటే ప్రమాదం” అంటూ ఎన్టీఆర్ విలన్ పాత్రను పరిచయం చేశారు. ఇండియాకు ఒక కొత్త శత్రువు తయారయ్యాడు అంటున్నారు. అలాంటి నెగిటివ్ రోల్ చేయడం ఎన్టీఆర్ కు అవసరమా ? అనేది ఎన్టీఆరే తేల్చుకోవాలి.

ఆస్కార్ తెర పై నిండుగా కనిపించిన నటుడు ఎన్టీఆర్. సౌత్ లో ముఖ్యంగా తెలుగులో టాప్ హీరో. అలాంటి హీరోని విలన్ గా ఊహించుకోవడం తారక్ ఫ్యాన్స్ కి కచ్చితంగా ఇబ్బందికర అంశమే. మరి ఎన్టీఆర్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో తనకే తెలియాలి. ఒక్కటి అయితే స్పష్టంగా చెప్పొచ్చు. వార్ 2 లో ఎన్టీఆర్ ది నెగిటివ్ అండ్ పాజిటివ్ క్యారెక్టర్. మహా భారతంలో కర్ణుడు పాత్రను పోలి ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. మరి చూడాలి వార్ 2 లో ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో !!.

Also Read:యాక్షన్ ఎపిసోడ్‌తో ‘సరిపోదా శనివారం’

- Advertisement -