బిగ్ బాస్ నియమాలు అతిక్రమిస్తే కఠిన శిక్ష !

317
jr ntr bigg boss season 1 contestants list
jr ntr bigg boss season 1 contestants list
- Advertisement -

 తెలుగు టీవీ చరిత్రలోనే ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సందడి షురూ అయ్యింది. వెండి తెరమీద మీద అలరించిన జూనియర్‌ ఎన్‌టీఆర్‌ ఇప్పుడు బుల్లి తెరమీద సందడి మొదలుపెట్టాడు.. తన అద్భుతమైన వ్యాఖ్యానంతో ఈ షోపై ప్రేక్షకులకు మరింత ఆసక్తి తెచ్చారు. పూణేలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌లో బిగ్‌ బాస్ షో మొదలైంది. ఈ షోలో భాగస్వామ్యం కానున్న 14 మంది పార్టిసిపెంట్స్‌ని ఎన్టీర్ పరిచయం చేశాడు.. వీరిలో మొదటి కాంటెస్టెంట్ గా అర్చన(నువ్వొస్తావని ఫేం) బిగ్‌ బాస్‌ సెట్‌లోకి అడుగుపెట్టారు. తరువాత సమీర్‌(మగధీర ఫేం), ముమైత్‌ఖాన్‌, వర్థమాన హీరో ప్రిన్స్, సింగర్‌ మధుప్రియ, సంపూర్ణేష్‌ బాబు, నటి జ్యోతి, సింగర్‌ కల్పన, సినీ విమర్శకుడు రమేష్‌ కత్తి, యాంకర్‌ కత్తి కార్తీక, నటుడు శివబాలాజీ, టీవీనటి హరితేజ, సినీ నటుడు ఆదర్శ్, నటుడు ధన్‌రాజ్‌ లు… సెట్‌లోకి అడుగుపెట్టారు.

వీరంతా 70 రోజుల పాటుఈ సెట్‌లో గడపనున్నారు. ఈ సెట్‌లో మొత్తం 60 కెమెరాలు ఉండగా.. సెట్‌లో అద్బుతమైన స్విమ్మింగ్‌ఫూల్, విశాలమైన హాలు ఏర్పాటు చేశారు. ఈ 70 రోజులు వీరు ఏమేమి చేస్తున్నారన్నదీ కెమెరాలో రికార్డవుతుంటుంది. పార్టిసిపెంట్స్ కు ఈ 70 రోజులు బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. షో నిబంధనల ప్రకారం ఇంట్లోని వారితో ఫోన్‌లో సంభాషించేందుకు అవకాశం ఉండదు. వారి సొంత పనులను వారే చేసుకుంటూ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ డబ్బై రోజులూ ఎలా గడిపారన్నది ఆసక్తిగా ఉంటుంది.బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నన్నాళ్లు తప్పని సరిగా మైక్ పెట్టుకోవాల్సిందే.ప్రతి సెలబ్రిటీ తప్పని సరిగా తెలుగులో మాట్లాడాలి.ప్రతి రోజు లైట్స్ ఆఫ్ చేయకుండా పడుకోరాదు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే ‘బిగ్ బాస్’ శిక్ష తప్పదు.. 14 మంది పోటీదారులను బిగ్ బాస్ ఇంట్లోకి పంపిన అనంతరం ఇంటికి తాళం వేశారు. తాళం వేసింది కేవలం బిగ్ బాస్ ఇంటికే.. ఆయన కంటికి కాదని ఎన్టీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ ఉల్లాసంగా, ఉత్సాహంగా కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తున్నారు.

https://youtu.be/hMojPhd0a7k

- Advertisement -