War 2:డబ్బింగ్ ప్రారంభించిన ఎన్టీఆర్

4
- Advertisement -

త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ దాదాపు ఖరారైన సంగతి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూట్ అయిన వార్ 2 గురించి రసవత్తరమైన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ హై-ఓక్టేన్ స్పై థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా చిత్ర యూనిట్ జూనియర్ ఎన్టీఆర్ తన పాత్రలకి సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభించారని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ శరవేగంగా కొనసాగుతోంది. ఇది సినిమా పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఒక కీలకమైన మైలురాయి.

కియారా అద్వానీ ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, 2025 ఆగస్ట్ 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. యాష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం, ప్రతిష్టాత్మకమైన YRF స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తోంది. ఈ చిత్రానికి సంగీతం ప్రీతమ్ అందిస్తున్నారు.

Also Read:Suriya 46..షూటింగ్ ప్రారంభం

- Advertisement -