పల్లాను పరామర్శించిన కేసీఆర్

7
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గాయపడిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఆయన నివాసమైన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్ రెడ్డి అక్కడ ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయారు.

దీంతో ఆయన తుంటి ఎముకకు గాయమైనట్లు తెలుస్తోంది. వెంటనే కార్యకర్తలు ఆయన్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించారు కేసీఆర్. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Also Read:Suriya 46..షూటింగ్ ప్రారంభం

- Advertisement -