మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ-నందమూరి కుటుంబాల నుంచి మల్టీస్టారర్ వస్తుండటం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లని ఒకే స్క్రీన్‌పై చూడనున్నారనే టాక్ అభిమానులలో ఫుల్ ఎనర్జీని నింపింది. తాజాగా కట్ చేస్తే ఎన్టీఆర్ రీసెంట్గా రామ్ చరణ్ ఇంట్లో ప్రత్యక్షం కావడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
రామ్ చరణ్ ఇంట్లో ఇరు కుటుంబాలు కలసి సందడి చేశాయి. రామచరణ్ తేజ్ ఇంట్లో క్రిస్మస్ ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసన ఆహ్వానంపై జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలసి వారి ఇంటికి వెళ్లాడు. మరో విశేషం ఏమిటంటే క్రిస్మస్ ట్రీని ఉపాసన విస్తరాకులతో స్వయంగా రూపొందించింది.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో పాటు యంగ్ హీరో శర్వానంద్, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. మిస్టర్ ‘సి’తో ఉన్న వ్యక్తులను గుర్తు పట్టగలరా?’ అని కామెంట్ పెట్టింది.
This is my #christmastree made with recyclable istaraakulu – it’s up to u to guess the ppl with Mr C 😜🧐🤪 #ramcharan #ramchanranbestie pic.twitter.com/gzTAlGFiUu
— Upasana Konidela (@upasanakonidela) December 13, 2017