నిర్మాతగా జూ.ఎన్టీఆర్.. హీరో అతనే

50
- Advertisement -

జూ. ఎన్టీఆర్ త్వరలో కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించబోతున్నారని నిన్నటి నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఎన్టీఆర్ తన బ్యానర్ లో మొదటి సినిమా ఎవరితో చేసుబోతున్నాడు అని చర్చ నడుస్తోంది. అయితే, చిన్న సినిమాలు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీలను నిర్మించాలన్న ఆలోచనలో తారక్‌ ఉన్నట్లు సమాచారం. అయితే, కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభిచడంపై ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను ఫాలో అవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇటీవల రామ్ చరణ్ తన స్నేహితుడు విక్రమ్‌తో కలిసి కొత్త నిర్మాణ సంస్థ V మెగా పిక్చర్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’‌తో మరో గ్లోబల్ స్టార్‌గా మారిన జూ.ఎన్టీఆర్ కూడా నిర్మాత అవతారం ఎత్తనున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ తన మొదటి సినిమాను న్యాచురల్ స్టార్ నానితో స్టార్ట్ చేస్తున్నట్లు టాక్ కూడా నడుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. కాగా, స్టార్ హీరోలైన మహేశ్ బాబు, ప్రభాస్‌లకు ఇప్పటికే సొంత ప్రొడక్షన్ హౌజ్‌లు ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: #BoyapatiRAPO: మైసూర్ షెడ్యూల్ రెడీ..

నిజానికి ఎన్టీఆర్ పై ఈ మధ్య చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ బిజినెస్ లోనూ అడుగు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడని… తన స్నేహితులతో కలిసి ఓ స్టూడియో నిర్మాణానికి ఎన్టీఆర్ సన్నాహాలు చేస్తున్నాడని.. శంషాబాద్ సమీపంలో స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడ పనులు మొదలు పెడుతున్నారని అంటున్నారు. ఈ స్టూడియోలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్రేన్లు, కెమెరాలను అందుబాటులో ఉంచనున్నారని తెలుస్తోంది. సినిమా షూటింగులకు వాటిని రెంట్ కి ఇవ్వనున్నట్టు చెబుతున్నారు.

Also Read: #VNRTrio:మ్యూజిక్ సిట్టింగ్‌

- Advertisement -