ఎన్టీఆర్ ..ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల లీస్టులో ఈయనొకరు. వరుస విజయాలతో జోరును కొనసాగిస్తూ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావటంతో ఈ సినిమా అంచనాలకు తారా స్థాయికి చేరిపోయాయి.
ఎన్టీఆర్ ఈ సినిమా కాకుండా దర్శక దీరుడు రాజమౌళీ దర్శకత్వంలో రామ్ చరణ్, తారక్ నటించబోతున్న మల్టీస్టారర్లో కూడా నటించబోతున్నాడు. ఇక త్రివిక్రమ్ సినిమా కోసం ఆయన ప్రత్యేక ట్రైనర్‌తో కసరత్తులు కూడా చేస్తున్నాడట. ఈ సినిమా షూటింగును ఇటీవలె ప్రారంభించి గ్యాప్ లేకుండా చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో కథనాయికగా నటిస్తుంది పుజా హెగ్డే.
ఇక విషయాకొస్తే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ విషయంలో త్రివిక్రమ్ ఒక ప్రకటన కూడా చేయలేదు. టైటిల్ విషయంలో త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటాడన్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా ఓ టైటిల్ వార్తల్లోకి వచ్చింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ వస్తుండటంతో ఈ సినిమాకు ‘అసామాన్యుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ టైటిల్ విషయంలో త్రివిక్రమ్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.