మళ్లీ తగ్గే పనిలో ఎన్టీఆర్

110
jr ntr
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ ది భారీ పర్సనాలిటీ. మెయిన్ గా తారక్ బాగా లావు. దానికి తోడు ఎన్టీఆర్ బాడీ కూడా ఇట్టే భారీగా పెరుగుతుంటుంది. ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ వుండాల్సిందే. పైగా ఎన్టీఆర్ భోజన ప్రియుడు. పైగా ఆర్ఆర్ఆర్ కోసం ప్రత్యేకంగా తగ్గాల్సిన పని లేకుండా పోయింది. దాంతో తారక్ అరవింద సమేత సమయంలో ఉన్న లావు కంటే.. ఇప్పుడు ఎక్కువ లావు ఉన్నాడు. మొత్తం మీద ఇటీవల ఎన్టీఆర్ ఫిజిక్ కాస్త షేప్ అవుట్ అయిందన్నది వాస్తవం. ఇప్పుడు ఒక పక్క కొరటాల శివ ప్రాజెక్ట్ షూట్ ను స్టార్ట్ చేసే, ఆలోచనలో ఉన్నాడు.

అందుకే, గత రెండు నెలల నుంచి ఎన్టీఆర్ మళ్లీ బాడీ తగ్గించే పనిలో నిమగ్నమయ్యాడు. పైగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కథలో హీరో బాగా ఫిట్ గా ఉండాలి. అలాగే సన్నగా కూడా ఉండాలి. కారణం ఎక్కువ జంపిగ్ లు ఉంటాయి. లావుగా కనిపిస్తూ.. జంపింగ్ లు చేస్తే.. చూడటానికి కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించక పోవచ్చు. సో.. బాగా సన్నబడే పనిలో ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీ గా వున్నాడని తెలుస్తోంది.

ఇదిలా వుంటే కొరటాల శివ సినిమా స్క్రిప్ట్ ను కూడా ఫినిష్ చేయాల్సి వుంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి అయ్యింది. ఎన్టీఆర్ సూచించిన చిన్న చిన్న మార్పుల పై కొరటాల వర్క్ చేస్తున్నాడు. మరో వారంలో స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా పూర్తి అయిపోతుంది. కానీ షూట్ ప్రారంభించాలంటే ఎన్టీఆర్ కొన్ని కిలోలు తగ్గాల్సిందే. కాబట్టి ఈ నెల చివర్లోనే ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి…

ధనుష్…చోరుడు ఫస్ట్ లుక్ లాంచ్

మెగా సినిమాకి డివోషనల్ టచ్

బద్రి రీ-రిలీజ్..ఎప్పుడంటే.!

- Advertisement -