బీజేపీకి రెబల్స్ బెడద..

129
- Advertisement -

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి రెబల్స్ రూపంలో కొత్త తలనొప్పి తయారైంది. తిరుగుబాటు అభ్యర్థులుగా 11 మంది పోటీచేస్తున్నారు. దీంతో ఆ పార్టీకి ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది. దీంతో 11మంది నేతలపై ఆ పార్టీ అధిష్ఠానవర్గం సస్పెన్షన్ వేటు విధించింది.

బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీల ఉన్న లవలేష్ శర్మ, రీను జైన్, రాజ్ కుమార్ ఖురానా, ధరమ్ వీర్ సింగ్ తదితరులపై బీజేపీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది.

ఈ సందర్భంగా బీజేపీ నేతలకు కీలక సూచనలు చేశారు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. నగర పేదల కోసం మురికివాడల పునరావాస ప్రాజెక్టు, మోదీ విజయాల గురించి ఎన్నికల్లో ఓటర్లకు చెప్పాలని బీజేపీ నేతలకు సూచించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -