మమతాపై బీజేపీ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు..

144
jp naddaj
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు రోజురోజు దుమారం రేపుతున్నాయి. బీజేపీ టీఎంసీ పార్టీల మధ్య మాట యుద్దం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో బుధవారం రాత్రి బెంగాల్‌ చేరుకున్న నడ్డా ఆనంద్‌పురి కలిబరి ఆలయంలో ప్రార్థనలు నిర్వహించి పరివర్తన యాత్ర ర్యాలీలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.తాము అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి కిసాన్‌ యోజన నిధుల గత బకాయిలనూ మోదీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా పేర్కొన్నారు.

బెంగాల్‌లోనూ కిసాన్‌ సమ్మాన్‌ నిధిని ప్రారంభిస్తామని, రాష్ట్రంలో 73 లక్షల రైతులు లబ్ధిపొందుతారని చెప్పారు. దేశవ్యాప్తంగా పది కోట్ల రైతు కుటుంబాలు ఉంటే దాదాపు 73 లక్షల రైతు కుటుంబాలు బెంగాల్‌లో ఉన్నాయి. రైతుల ఖాతాల్లో ఇప్పటివరకూ ఏడు వాయిదాల్లో నగదు జమ అయినా, మమతా బెనర్జీ తీరుతో బెంగాల్‌లో రైతులకు మాత్రం ఈ సాయం దక్కలేదని నడ్డా ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు బంగ్లా ఆవిష్కరణకు బీజేపీ కృషి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

- Advertisement -