ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా జర్నలిస్ట్ పరమేశ్వర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించిన సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్‌ఆర్ శర్మ మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను ఆయన విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ప్రకృతి సమతుల్యతకు దోహదం చేస్తుందని అన్నారు.
కాగా పర్యావరణ హితం కోసం గ్రీన్ చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కి వైఎస్‌ఆర్ శర్మ ధన్యవాదాలు తెలిపారు. ఈ గ్రీన్ ఛాలెంజ్‌కు ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ఫారీదుద్దిన్,హీరో రాజేంద్రప్రసాద్,సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ రెడ్డిలను నామినేట్ చేసారు ఈ సందర్భంగా మహా యజ్ఞంలో నన్ను భాగస్వామిని చేసిన జర్నలిస్ట్ పరమేశ్వర్‌కి ధన్యవాదాలు తెలిపారు.
Andhra Prabha Editor YSR Sharma Accepted Green Challenge By MP Santosh Kumar, He Planted Three Saplings…