సంతోష్ శోభన్…జోరుగా హుషారుగా షికారు పోదమ

37
- Advertisement -

సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’. స్టోరీ క్యాట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.ఒరిజినల్స్ అసోసియేషన్ విత్ ఎం.ఆర్.ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సుభాష్ చంద్ర దర్శకత్వంలో ప్రవీణ్ నంబారు, సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన మోషన్ పోస్టర్, పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ బుధవారం ‘ప్రేమ…’ అనే మెలోడీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. నాగవంశీ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. క్లాసికల్ టచ్‌తో సాగే ఈ పాట అందరి హృదయాలను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ పాట అందరి ప్లే లిస్టులో స్థానం దక్కించుకుంటుందనటంలో సందేహం లేదు.

పాటను వింటుంటే హీరోయిన్ ఫల్గుణి ఖన్నా తన మనసులో సంతోష్ శోభన్‌పై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంది. ప్రయాణంలో మనసులో ప్రేమ ఎలా పుట్టిందనే విషయాన్ని వివరించేలా పాట అందంగా ఆకట్టుకుంటోంది. హరిణి ఇవటూరి తనదైన శ్రావ్యమైన గొంతుతో పాడిన పాట వినసొంపుగా ఉంది. దినేష్ కక్కెర్ల ఈ పాటను రాశారు.

అలాగే పాటలోని రాజస్థానీ లిరిక్స్‌ను రాజేష్ కొలర్జ చక్కగా సమకూర్చారు. లిరికల్ వీడియోలో కేవలం పాట మాత్రమే కాకుండా మధ్యలో వచ్చే గ్లింప్స్, మ్యూజిక్ మేకింగ్ ప్రాసెస్‌ను చూపించారు. ఇది అందరినీ మెప్పిస్తోంది. ప్రేమ, భావోద్వేగాలను ఈ పాట చక్కగా ఎలివేట్ చేస్తోంది.భావోద్వేగాల సమాహారంగా ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’ ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నాగవంశీ సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ చిత్రానికి సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే నిర్మాతలు సిినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read:తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

- Advertisement -