వయసు పైబడే కొద్ది కీళ్ల నొప్పులు రావడం సహజం. వృద్దులను ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. కీళ్లనొప్పుల కారణంగా వారు ఏ పని చేయలేక పోతుంటారు. ఎందుకంటే కొద్దిదూరం నడిచే సరికి మోకాళ్ళ నొప్పులు రావడం ఏదైనా పని చేసే టైమ్ లో వెన్నునొప్పి, నడుం నొప్పి వేధించడం జరుగుతుంది. తద్వారా ఈ నొప్పుల కారణంగా వారిలో వారే మధన పడిపోతుంటారు. ఒక్కసారి కీళ్ల నొప్పులు రావడం ప్రారంభమయితే అంత త్వరగా విడిచిపెట్టవు. కొందరికి దీర్ఘకాలిక సమస్యగా కూడా మారతాయి. అందువల్ల కీళ్లనొప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కీళ్ల నొప్పుల నుంచి త్వరగా బయట పడాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం.
అంతే కాకుండా మల్టీ విటమిన్స్, బయోటిన్ సప్లిమెంట్స్ వంటివి వైద్యుల సలహా మేరకు తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పుల నుంచి త్వరగా బయట పడవచ్చు. ఇంకా తినే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. క్యారెట్, బీట్ రూట్, క్యాప్సికమ్, బీన్స్, చిక్కుడు, క్యాబేజీ.. వంటివి ఆహార డైట్ లో ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటు అన్ని రకాల పండ్లు తినడం చాలా మంచిది. ఎందుకంటే పండ్లలో మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా అరటిపండు, నారింజ, బత్తాయి, కివీ వంటివి ఎక్కువగా తినాలి. అరటిపండు లో ఉండే పొటాషియం, మెగ్నీషియం కీళ్లవాతాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంకా బత్తాయి, ఆరెంజ్, కివీ వంటి వాటిలో సిట్రిక్ ఆమ్లం ఎక్కువగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి ఆయా సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి వృద్దులను ఎక్కువగా వేధించే కీళ్లనొప్పుల నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే పై సూచనలు తప్పకుండా పాటించాలి.
Also Read:ట్విట్టర్ రివ్యూ…గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి