ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిసిన మాజీ స్పీక‌ర్..

287
nadendla manohar

సాధార‌ణ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు హీటెక్కుతోన్నాయి. ఓ వైపు వైసిపి అధినేత జ‌గ‌న్ పాత‌యాత్ర‌తో జ‌నంలో తిరుగుతుంటే..ధ‌ర్మ దీక్షల పేరుతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పోరాటాలు చేస్తోన్నారు. మొన్న‌టి వ‌ర‌కూ ఏపీలో ప్ర‌త్యేక హోదా పై పెద్ద ఉద్య‌మం న‌డిచిన విష‌యం తెలిసిందే. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ కి మ‌ద్ద‌తు ప‌లికిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తీవ్ర స్దాయిలో విమ‌ర్శ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే.

danam nagendar, pawn kalyan

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో అస‌లు కాంగ్రెస్ పార్టీయే లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీలోని సీనియ‌ర్ నేత‌లంద‌రూ ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడ‌గొట్టింద‌న్న కోపంతో ప్ర‌జ‌లు ఆపార్టీని ఒక్క స్ధానంలో కూడా గెలిపించ‌లేదు. వేరే ప్ర‌త్యామ్మాయం లేక ప‌లువురు నేత‌లు టీడీపీ, వైఎస్ ఆర్ సిపిలో చేరిపోయారు. తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న ఏపీ రాజ‌కీయ‌ల్లో ఆస‌క్తి రేపుతోంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో స్పీక‌ర్ గా ప‌నిచేసిన‌టువంటి నాదెండ్ల మ‌నోహార్ కొద్ది సేప‌టి క్రీత‌మే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో భేటీ అయ్యారు.

nadendala manohar

హైద‌రాబాద్ లోని ప‌వ‌న్ నివాసంలో జ‌రిగిన ఈమీటింగ్ లో దాదాపు అర‌గంట పాటు వీరు స‌మావేశం నిర్వ‌హించిన‌ట్టు తెలుస్తోంది. ఇదంతా చూస్తోంటే త్వ‌ర‌లోనే నాదేండ్ల మ‌నో్హ‌ర్ జ‌న‌సేన పార్టీ కండువా క‌ప్పుకోనున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త నాలుగు రోజుల క్రీత‌మే ఏపీ కాంగ్రెస్ నేత‌లు రాహుల్ గాంధీతో స‌మావేశ‌మ‌య్యారు. ఆ సమావేశానికి నాదేండ్ల మ‌నోహ‌ర్ కూడా హాజ‌ర‌య్యారు. ఏపీలో పార్టీ బ‌లోపేతం పై రాహుల్ తో చ‌ర్చించారు. అంత‌లోనే మ‌నోహ‌ర్, ప‌వ‌న్ తో భేటీ కావడంపై ఏపీలో రాజ‌కీయాల్లో చ‌ర్చాంశ‌నీయ‌మైంది. 2014 ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత నాదేండ్ల మ‌నోహ‌ర్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. త్వ‌ర‌లోనే మ‌నోహ‌న్ జ‌నసేన కండువా క‌ప్పుకుంటార‌నే విష‌యంపై  ఏపీలో చ‌ర్చ‌న‌డుస్తోంది.