సీఎమ్ కేసీఆర్ ఆదర్శాలతో… భారీగా చేరికలు:కిశోర్‌ కుమార్‌

29
Kishore Kumar
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కే. చంద్రశేఖర్ రావ్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని సూర్యపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్‌ అన్నారు. తిరుమలగిరి లోని ఎమ్మెల్యే నివాసంలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం తదితర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కిశోర్‌ కుమార్‌ గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిశోర్ కుమార్‌ మాట్లాడుతూ.. “గతంలో తుంగతుర్తి నియోజకవర్గం అంటే అరాచకాలకు రక్తపాతాలకు నిలయంగా ఉండేది. కాగా, తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సీఎం కేసీఆర్ మార్గదర్శకాల్లో, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో నియోజకవర్గ రూపురేఖలు మార్చేశానని” తెలిపారు. ఒకప్పుడు ఇక్కడి ప్రజలకు పని లేక, కుటుంబాన్ని పోషించలేక వలసలు వెళ్లగా..ఇప్పుడు సీఎం కేసీఆర్ కృషీ ప్రణాళికలతో గోదావరి నీరు రావడం వలన చేతినిండా పని చేసుకుంటూ, భార్యా పిల్లలతో ఆనందంగా జీవిస్తున్నారు. అంతేకాక ఇప్పుడు ఇతర రాష్ట్రాల కూలీలు కూడ ఇక్కడికి ఉపాధి కోసం వలస వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు డిపాజిట్లు కూడ దక్కించుకోలేవు. ఆ డిపాజిట్ల కోసమే పడరాని పాట్లు పడుతున్నాయని ఎగతాళి చేశారు.

- Advertisement -