ఒకేరోజు 21 పుచ్చకాయలు తిన్న బాలీవుడ్‌ స్టార్!

327
john abraham
- Advertisement -

బాలీవుడ్ కండలవీరుడు జాన్ అబ్రహం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు హీరో వరుణ్ ధావన్‌. అభిమానులతో సరదాగా ముచ్చటించిన వరుణ్‌…జాన్ అబ్రహం ఒకేరోజు 21 పుచ్చకాయలు తిన్నాడని చెప్పుకొచ్చాడు.

2016లో డిషూం సినిమా షూటింగ్‌ సందర్భంగా జాన్ ఒకే రోజు 21 పుచ్చకాయలు తిన్నాడని చెబుతూ ఇందుకు సంబంధించి జాన్‌తో దిగిన ఫోటోను షేర్ చేశాడు.

డిషూం సినిమా విడుదలై నాలుగేళ్లు పూర్తైంది. ఈ సినిమా కోసం మంచి టీంతో పనిచేశా. నా ఇద్దరు అన్నలూ ఎప్పుడు నా వెనుకే ఉంటారు. మళ్లీ ఈ టీం కలువాల్సిన సమయం వచ్చింది అని అనుకుంటున్నా అని తెలిపాడు ధావన్‌.

- Advertisement -