రష్యాకు షాకిచ్చిన అమెరికా…

179
biden
- Advertisement -

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగితే రష్యాపై ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించిన అగ్రరాజ్యం అమెరికా ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ..​ఆ దేశా నికి చెందిన 4 బ్యాంకుల ఆస్తులను బ్లాక్​ చేస్తామని ప్రకటించారు.

రష్యాదాడులను తీవ్రంగా ఖండిస్తు న్నామని చెప్పిన బైడెన్‌…ఉక్రెయిన్​లో పరిణామాల కు రష్యానే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. యూఎస్​తోపాటు మిత్ర దేశాలన్నీ సరైన సమయంలో స్పందిస్తాయని …ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్​ ప్రజలకు అండగా ఉంటాయన్నారు.

ఉక్రెయిన్​పై రష్యా అన్యాయంగా దాడులు చేస్తోందని, సామాన్య ప్రజలను చంపేస్తోందని బైడెన్ ఆందోళ వ్యక్తంచేశారు. దాదాపు 3 ట్రిలియన్ డాలర్ల రష్యన్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తామని చెప్పారు.

- Advertisement -