తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా ఇకలేరు..

5
- Advertisement -

BRS రాష్ట్ర నాయకులు,తెలంగాణ ఉద్యమ నేత జిట్ట బాలకృష్ణ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామం భువనగిరి శివారులోని బొమ్మాయి పల్లి గ్రామంలో ని,, వ్యవసాయ క్షేత్రంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

భువనగిరి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించారు జిట్టా. యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన జిట్టా…2009 లో భువనగిరి అసెంబ్లీ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. యువతెలంగాణ పార్టీ స్థాపించి తర్వాత బిజెపి లో విలీనం చేశారు జిట్టా.గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సొంతగూటికి చేరారు. నెలరోజులుగా మృత్యువు తో పోరాడి ఓడారు జిట్టా బాలకృష్ణ రెడ్డి.

ట్రీట్మెంట్ కు బాడి సహకరించక పోవడం తో తుది శ్వాస విడిచారు జిట్టా. ఆయన మరణ వార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు అనుచరులు,అభిమానులు. టీఆర్ఏస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ తో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు జిట్టా.

Also Read:రైతులకు ఉచితంగా సోలార్ పంప్‌సెట్లు:సీఎం రేవంత్

- Advertisement -