జియో ‘రైల్‌’ వచ్చేసింది

316
JioRail App
- Advertisement -

టెలికాం దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టిస్తూ వినియోగదారుల ఆదరాభిమానాలను చూరగొన్న రిలయన్స్ జియో తాజాగా మరో సరికొత్త అప్లికేషన్‌తో ముందుకువచ్చింది. రైలు టిక్కెట్‌లను బుక్‌ చేసుకునేందుకు ఉపయోగిస్తున్న ఐఆర్‌సీటీసీ యాప్‌ లాగే సేవలందించే ‘జియో రైల్’ యాప్‌ను కంపెనీ ప్రారంభించింది.

ఈ యాప్ తో వినియోగదారులు ఐఆర్సీటీసీ రైల్ టికెట్ బుకింగ్ సేవలను ఉపయోగిస్తూ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఫీచర్ ఫోన్ ద్వారా రైలు టికెట్ బుక్ చేసుకొనే సౌకర్యం కలగడం దేశంలో ఇదే మొదటిసారి. ఐఆర్‌సీటీసీ ఖాతా లేకపోయిన్పటికీ ‘జియో రైల్’ యాప్‌ ద్వారా టికెట్స్‌ బుక్ చేసుకోవచ్చు.

రైళ్ల రాకపోకలకు సంబంధించిన సమాచారం, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, సీట్ల లభ్యత, టిక్కెట్‌ల రద్దు వంటి సేవలను ఈ యాప్‌లో పొందుపరిచారు. అంతేకాకుండా చివరి నిమిషాల్లో ప్రయాణం కోసం బుక్‌ చేసుకునే తత్కాల్‌ టికె‌ట్‌లకు కూడా ఈ యాప్‌ను ఉపయోగించి బుక్‌ చేసుకోవచ్చు.

రిలయన్స్ జియో, రైల్వేల అఫీషియల్ సర్వీస్ ప్రొవైడర్. 1 జనవరి 2019 నుంచి జియో రైల్వేలకి చెందిన 3.78 లక్షల అధికారులు-సిబ్బందికి తన సేవలు అందిస్తోంది. జియోకి ముందు భారతీ ఎయిర్ టెల్ రైల్వేలకు సేవలందించింది.

- Advertisement -