జియో డీటీహెచ్ ఫ్రీ.. ఫ్రీ…!

222
- Advertisement -

మార్కెట్లో ఉన్న ధరలకంటే తక్కువ ధరకే టీవీ ఛానళ్లను ఇచ్చేందుకు సిద్దమౌతున్నట్టు జియో ప్రకటించేసింది. ఉచిత ఇంటర్నెట్‌తో టెలికాం రంగంలో సంచలనం సృష్టించి ఇప్పుడు డీటీహెచ్‌ మార్కెట్‌పై కన్నేసింది జియో. రిలయన్స్ జియో డీటీహెచ్ సర్వీసులను మే నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సెట్ టాప్ బాక్స్‌లు సిద్ధమయ్యాయని, ఇక సర్వీస్‌ను ప్రారంభించడమే తరువాయి అని జియో ప్రకటించింది. అంతేకాదు జియో సెట్ టాప్ బాక్స్‌ను ఇంటర్‌నెట్ సేవలకు అనుసంధానం చేసేందుకు వీలుగా రూపొందించినట్లు తెలిపింది. జియో ఇప్పటికే ఈ సేవల నిమిత్తం ప్రధాన నగరాల్లో పనులు ప్రారంభించినట్లు అధికారికంగా పేర్కొంది.

ఇటీవల ఆన్‌లైన్‌లో లీకైన సెట్‌టాప్‌ బాక్స్‌ను చూస్తే జియో త్వరలో ఐపిటీవీ సేవల రంగంలోకి ప్రవేశిస్తుందన్న ప్రచారం సాగుతోంది. ఏ టీవీ చానల్ ను అయినా మరింత స్పష్టంగా వీక్షించే వీలుండేలా ఈ సెట్ టాప్ బాక్సులు ఉంటాయని, ఈ సెట్ టాప్ బాక్సుల ద్వారా 50కి పైగా హెచ్డీ చానల్స్ తో పాటు 300కు పైగా వీడియో చానల్స్ ప్రసారాలను వీక్షించవచ్చని సమాచారం.

ఇక జియో సెల్ కనెక్షన్ మాదిరిగానే, మూడు నెలల ఉచిత ఆఫర్ తో ఈ సెట్ టాప్ బాక్సులు వస్తాయని, ఈ బాక్స్ సాయంతో 1 జీబీపీఎస్ వేగంతో బ్రాడ్ బ్యాండ్ సేవలనూ పొందవచ్చని సమాచారం. రిలయన్స్ జియో తెలిపిన వివరాల ప్రకారం డీటీహెచ్ సేవలు, వాటి ధరలు ఈ విధంగా ఉండబోతున్నాయి. జియో డీటీహెచ్ ప్రారంభ ధర: 900 రూపాయలుగా ఉంటుందని సమాచారం. వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా మొదటి మూడు నెలలు ఉచితంగా సర్వీసు ఇవ్వనుంది జియో.  జియో డీటీహెచ్ ను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్టు సమాచారం.

dth

- Advertisement -