అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలోని డైలాగ్‌ని వాడి మరోసారి వార్తల్లో నిలిచారు గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాని. పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా తగ్గేదేలే అంటూ వెళ్లిన జిగ్నేశ్…బెయిల్ పై విడుదలైనప్పుడు కూడా అదే మేనరిజాన్ని చూపించి బీజేపీపై విమర్శలు గుప్పించారు.
మహిళా పోలీసు అధికారిపై దాడి చేశారన్న ఆరోపణల కేసులో జిగ్నేశ్ మేహానీని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. అయితే శుక్రవారం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఫేక్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసుల వైఖరిని కోర్టు తప్పుబట్టింది.
అధికారంలో ఉన్న బీజేపీ మహిళను అడ్డుపెట్టుకుని నాపై అక్రమ కేసు బనాయించిందని…ఇది పీఎంవోలోని రాజకీయ పెద్దల సూచన మేరకే జరిగిందన్నారు.ఎన్నికలు సమీపిస్తున్నందున బీజేపీ ఇలా చేస్తోందని ఆరోపించారు. తన అరెస్టు సమయంలో మద్దతు ఇచ్చిన ప్రజలకు, కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.