కేటీఆర్ వ్యాఖ్యలకు సీపీఐ నారాయణ మద్దతు..

72
ktr
- Advertisement -

నిన్న తెలంగాణ ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఏపీ అభివృద్దిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిశారు. ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెను దుమారాన్ని లేపుతున్నాయి. కేటీఆర్‌ కామెంట్స్‌పై ఏపీ మంత్రులు,వైసీపీ నేతలు ఖండిస్తుండగా.. ఇతర పార్టీ నాయకులు మాత్రం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మద్దతిస్తున్నారు. తాజాగా కేటీఆర్‌ వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని సీపీఐ నారాయణ మద్దతు తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లిన ఏపీ మంత్రి రోజా.. రాష్ట్రంలో రోడ్లు, విద్యుత్ అమలుపై మాట్లాడలేదన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు పచ్చినిజాలని వ్యాఖ్యానించారు. మంత్రి రోజా, తన నియోజకవర్గం నగరిలోనే ఏపీ, తెలంగాణ సరిహద్దు రోడ్లు ఉన్నాయని.. రెండు రాష్ట్రాలలో రోడ్ల పరిస్థితి ఎలా ఉన్నాయో వీడియో తీసి పోస్ట్ చేశారు నారాయణ.

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు గతుకులు, గుంతలు మయం అన్నారు నారాయణ. ఏపీలో అమలవుతున్న అప్రకటిత విద్యుత్ కోతలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నాను అన్నారు. పారిశ్రామిక వాడల ఏర్పాటుకు సానుకూల ప్రాంతం తెలంగాణ అని పక్కన ఉన్న ఏపీలో లాగా అప్రకటిత విద్యుత్ కోతలు ఉండవని.. గుంతల మయమైనటువంటి ధ్వంసమైన రోడ్లు ఉండవన్నారు. రాష్ట్ర మంత్రి రోజా నియోజకవర్గం నగరి మండలంలోనే సీపీఐ తన స్వగ్రామమైన ఐనంబాకం గ్రామానికి వచ్చి రోడ్ల పరిస్థితి చూడండి అని దృశ్యాలతో సహా వివరించారు.

- Advertisement -