బీజేపీకి షాక్…జార్ఖండ్ కాంగ్రెస్ కూటమి హవా

585
jharkhand
- Advertisement -

జార్ఖండ్ శాసనసభ ఎన్నికల కౌంటింగ్  కొనసాగుతోంది. అధికార బీజేపీ 31 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా జేఎంఎం కూటమి 43 స్ధానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. జేఎంఎం 22,కాంగ్రెస్ 12,ఆర్జేడీ 4 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 41ని సాధించాయి.

జంషడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి రఘుబర్ ముందంజలో ఉండగా జేఎంఎం చీఫ్ హేమంత్ సోరేన్ దుంకా, బహెరెట్ రెండు స్ధానాల్లో ముందంజలో ఉన్నారు. ధన్ నుంచి బాబూలాల్ మారండి ముందంజలో ఉన్నారు.

మొత్తం 91 స్ధానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి ఐదు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగా మధ్యాహ్నం కల్ల పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే మళ్లీ అధికారమని తేల్చిచెప్పగా కౌంటింగ్ సరళిని చూస్తే జేఎంఎం కూటమి స్వల్ప మెజార్టీ సాధించే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

- Advertisement -