సీఎం కేసీఆర్‌ను కలిసిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్…

42
cm kcr
- Advertisement -

హైదరాబాద్ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిశారు జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌. గురువారం ప్రగతి భవన్‌కు వచ్చిన హేమంత్‌కు సాదరంగా స్వాగతం పలికిన సీఎం కేసీఆర్…పార్టీ నేతలను పరియం చేశారు. హేమంత్‌ సోరెన్‌ మూడు రోజులపాటు హైదరాబాద్‌లో ఉండనున్నారు.

ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య దేశ రాజకీయాలు, వర్తమాన అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. బీజేపీని ఓడించడానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందని, దీనికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి త్వరలో అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహించాలని ఈ సమావేశంలో అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

విపక్షాలపై కక్ష సాధింపు కోసం సీబీఐ, ఈడీ, ఐటీ వంటి విభాగాల దుర్వినియోగం, గవర్నర్లు సృష్టిస్తున్న ఇబ్బందులు వంటి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

- Advertisement -