యాంకర్ సుమకి ఉన్న క్రేజ్ గురించి, సినిమా ఇండస్ట్రీలో యాంకర్ గా ఆమెకున్న డిమాండ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. షో ఏదైనా సరే.. ఆ షోకి యాంకర్ మాత్రం సుమే అయ్యి ఉంటుంది. అసలు సుమ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. స్టార్ యాంకర్‌గా బుల్లితెరపై సుమ ఎన్నో ఏళ్లుగా సందడి చేస్తోంది. అందరూ అక్క అని పిలిచేలా క్రేజ్ సంపాదించుకుంది. అయితే, తాజాగా అభిమానులకు సుమ ఓ షాకింగ్ న్యూస్ రివీల్ చేసింది.
తాను యాంకరింగ్‌కు కొన్నాళ్ల పాటు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పి సుమ భావోద్వేగానికి గురైంది.’నేను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకొని ప్రేమించారు’ అని కన్నీరు పెట్టుకుంది. ఇంతకీ సుమ సడెన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. తన పిల్లల కోసమే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. మరి ఇప్పుడు సుమ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు ?, అసలు తెలుగులో సుమ స్థాయిను అందుకునే యాంకర్స్ ఉన్నారా ?,
నిజానికి సుమ యాంకర్ గా పేరు తెచ్చుకోక ముందు మన తెలుగు సినిమాలకు ప్రమోషన్స్ చేయాలన్నా, ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయాలన్నా గతంలో ఝాన్సీ, ఉదయభాను ఉండేవారు. తర్వాత కేవలం సుమ మాత్రమే అవకాశాలు సృష్టించుకొంది. ఎన్నో ఏళ్లుగా యాంకరింగ్ చేస్తున్న సుమ ఇప్పుడు విరామం తీసుకోబోతోంది. ఈ నేపథ్యంలోనే సుమ తర్వాత ఆ రేంజ్ లో యాంకరింగ్ చేసేవారు ఎవరున్నారనే దానిపై చర్చలు మొదలయ్యాయి. ఐతే, ఝాన్సీ, ఉదయభాను లాంటి వాళ్ళు సుమ స్థానానికి న్యాయం చేయగలరు.
ఇవి కూడా చదవండి..