BB10: తొలి కెప్టెన్‌గా ఝాన్సీ..

8
- Advertisement -

బుల్లితెరపై సందడి చేస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య పోటీ తీవ్రతరం అవుతుండగా, ఈ సీజన్‌కు సంబంధించిన మొదటి కెప్టెన్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. నాటకీయ పరిణామాల మధ్య ‘గోల్డెన్ టికెట్’ కంటెస్టెంట్ ఝాన్సీ బిగ్ బాస్ హౌస్ తొలి కెప్టెన్‌గా నిలిచింది.

కెప్టెన్సీ రేసులో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లు—త్రిగుణ్, రామ్‌ప్రసాద్, ఝాన్సీ, ముకేశ్, షాలినిలకు బిగ్ బాస్ “చిక్కకు – దొరకకు” అనే జైలు-కానిస్టేబుల్ టాస్క్‌ను ఇచ్చారు. పోటీదారులు జైలు నుంచి గార్డ్స్‌ను దాటుకుని సేఫ్ జోన్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ టాస్క్‌లో హౌస్‌మేట్స్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి.

ముఖ్యంగా షాలిని, ముకేశ్ మధ్య మాటల యుద్ధం సాగగా.. త్రిగుణ్ ప్రవర్తనపై మిగతా కంటెస్టెంట్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రేస్ నుండి నిష్క్రమించిన తర్వాత త్రిగుణ్ జైల్లో కూర్చుని తాను సింహాన్నని, మిగతావాళ్ళు నక్కలంటూ పాడిన పాట హౌస్‌లో మరింత వేడిని రాజేసింది.

చివరికి కెప్టెన్సీ ఫైనల్ రౌండ్‌కు రామ్‌ప్రసాద్, ఝాన్సీ చేరుకున్నారు. ఈ రౌండ్‌లో తానే గెలుస్తాననే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో రామ్‌ప్రసాద్ బిగ్ బాస్‌పైనే జోకులు వేస్తూ హడావిడి చేశాడు. కానీ ఫైనల్ టాస్క్‌లో కట్టర్‌తో కంచె కట్ చేసి, తాళాలు తీసి, బాక్స్‌లోని బరువులతో కెప్టెన్ జెండాను పైకి లాగే ప్రక్రియలో రామ్‌ప్రసాద్ తడబడ్డాడు. దీన్ని సమర్థవంతంగా వాడుకున్న ఝాన్సీ, వేగంగా టాస్క్ పూర్తి చేసి తొలి కెప్టెన్ కిరీటాన్ని దక్కించుకుంది.

Also Read:‘ది ప్యారడైజ్’..ఎంజాయ్ చేస్తారు

ఓవైపు గొడవలు జరుగుతుంటే, మరోవైపు హౌస్‌మేట్స్ సరదా సన్నివేశాలతో అలరించారు. వంశీ, నరేష్, రోహిత్, త్రిగుణ్, అమన్, రామ్‌ప్రసాద్ కలిసి ‘ఛత్రపతి’ సినిమాలోని ఐకానిక్ సీన్‌ను రీ-క్రియేట్ చేసి అందరినీ నవ్వించారు. దీనిని బిగ్ బాస్ కూడా ప్రశంసించారు. వర్షిణి-చరణ్ సంభాషణలు, రోహిత్ తన పనిని తప్పించుకునే ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మొత్తానికి ఝాన్సీ కెప్టెన్ అవ్వడంతో హౌస్‌లో సమీకరణాలు మారాయి. మరోవైపు వీకెండ్ దగ్గరపడుతుండటంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి నెలకొంది.

- Advertisement -