టీజర్‌తో వస్తున్న నాని…

226
nani
- Advertisement -

దేవదాస్ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన స్టార్ హీరో నాని. ప్రస్తుతం ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ‘జెర్సీ’ అనే సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యవేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

నాని సరసన కన్నడ యూటర్న్ ఫేమ్ శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తోండగా డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నారు. సత్యరాజ్, బ్రహ్మాజీ, రోనిత్ కామ్రా తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్‌ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈచిత్రం లో అర్జున్ పాత్రలో క్రికెటర్ గా కనిపించనున్నాడు. జ‌న‌వ‌రి 1న చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన చిత్ర బృందం రేపు టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలిపింది. ఈ టీజ‌ర్ నాని అభిమానుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -