నాని…ఫన్,ఎమోషన్‌,ప్రస్టేషన్..ఏడిపించేశాడు

406
jersy trailer
- Advertisement -

మళ్ళీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

ట్రైలర్‌లో నాని విశ్వరూపం చూపించాడు. ఫన్,ఎమోషన్‌,ప్రస్టేషన్‌ తనదైన నటనతో ఫ్యాన్స్‌ని ఫిదా చేశాడు. నాని గ్రౌండ్స్‌లోకి ఎంటరవుతూ హీరోయిన్‌ ఐ లవ్‌ యూ అంటూ చెప్పడంతో సాగిన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను పెంచేశాడు. రేపు నాని గాడి బర్త్ డే…నీకు అవసరానికి మించి అడిగే కొడుకు ఉన్నా సంపాదించే పెళ్లాం లేదు..నువు ఇంతకుమించి దిగజరావన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్ అంటూ సాగే డైలాగ్‌లు బాగున్నాయి. పదేళ్ల క్రితం ఆగిపోయిన నా కెరీర్‌ని మళ్లీ మొదలుపెడతాను..లైఫ్‌లో ఫస్ట్ టైం నీ మీద కోపం వస్తుంది..ఏం చేయమన్నా చేస్తాను కానీ లైఫ్‌లో తలదించుకోలేను..ఇంతపెద్ద ప్రపంచంలో ఈరోజు వరకు నన్ను జడ్జ్ చేయంది నా కొడుకొక్కడే అంటూ నాని చెప్పే మాటలు ట్రైలర్‌కి హైలైట్‌గా నిలిచాయి.

జెర్సీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 15న నిర్వహించి సినిమాపై మ‌రింత హైప్ తేవాల‌ని యూనిట్ భావిస్తుంది. జెర్సీ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. అనిరుధ్ రవిచందర్ స్వరాల్ని సమకూర్చుతున్నారు. 1996-97 రంజీట్రోఫీ క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. సత్యరాజ్, రోనిత్‌కర్మ, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం హిందీలోను విడుద‌ల కానుంది.

- Advertisement -