తీవ్రమైన తప్పులు చేశా..కానీ!

1
- Advertisement -

ఎన్విడియా సీఈవో పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజులకే జెన్సన్ హువాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీ డైరెక్టర్ల బోర్డు కోరుకుంటే తిరిగి సీఈఓగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన తప్పులు చేశానని అంగీకరించారు.

ఈ మేరకు ఎక్స్‌ (X) వేదికగా ఆయన ఓ పోస్ట్ చేశారు. వాటాదారులు, ఉద్యోగులు, కంపెనీ, అమెరికా ప్రయోజనాల దృష్ట్యా నేను తిరిగి రావడమే మంచిదని డైరెక్టర్ల బోర్డు నిర్ణయిస్తే.. వారి పిలుపును గౌరవంగా స్వీకరించి సీఈఓగా తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాను అని పేర్కొన్నారు.

తాను పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఎన్విడియా ఉద్యోగులు, పెట్టుబడిదారులు, వ్యాపార భాగస్వాములు, కస్టమర్లు తిరిగి సీఈఓగా రావాలని కోరుతున్నారని జెన్సన్ హువాంగ్ తెలిపారు. చాలామంది నేరుగా తనను సంప్రదిస్తూ ఇదే విషయాన్ని చెబుతున్నారని వెల్లడించారు.

ఎన్విడియాలో ప్రతి ఒక్కరి నుంచి ఆశించే ప్రమాణాలకు అనుగుణంగా నేను వ్యవహరించలేకపోయాను. నా వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన తప్పులు చేశాను. దీనివల్ల డైరెక్టర్ల బోర్డుకు సమస్యలు సృష్టించాను. అందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను అని హువాంగ్ పేర్కొన్నారు.

Also Read:కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదా?: కేటీఆర్

తాను చేసిన తప్పులకు పూర్తి బాధ్యత వహిస్తున్నానని ఈ వ్యవహారంపై బోర్డు చేపట్టిన స్వతంత్ర దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -