ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు..

296
Jeff Bezos
- Advertisement -

ప్రముఖ ఫోర్బ్ పత్రిక ప్రపంచ కుబేరుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో దాదాపు 141.9 బిలియన్ డాలర్ల సంపదతో అమేజాన్ రిటైల్ వ్యవస్థాపకుడు సీఈవో అయిన జెఫ్ బిజోస్ ప్రపంచంలోనే నంబర్ ధనవంతుడిగా నిలిచారు.

జూన్‌ 1 నుంచి బిజోస్‌ సంపద దాదాపు 5 బిలియన్‌ డాలర్లు పెరిగింది. గతేడాది కూడా ఆయనే బిలియనీర్‌ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానంలో 92.9బిలియన్‌ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ఉండగా.. 82.2బిలియన్‌ డాలర్ల సంపదతో వారెన్‌ బఫెట్‌ మూడో స్థానంలో ఉన్నారు.

Jeff Bezos

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో యాపిల్‌ తర్వాత అమెజాన్‌ ఉంది. ఇక అమెరికాలోని అతిపెద్ద కంపెనీల్లో 177.87బిలియన్‌ డాలర్ల ఆదాయంతో అమెజాన్‌ ఎనిమిదో స్థానంలో ఉంది. ఫోర్బ్స్‌ విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో టాప్‌ 100లో నలుగురు భారతీయులకు మాత్రమే చోటు దక్కింది. 40.1 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ 19వ స్థానంలో ఉన్నారు.

ఇక అజీమ్‌ ప్రేమ్‌ జీ 18.8బిలియన్‌ డాలర్ల సందతతో 58వ స్థానంలో ఉండగా, లక్ష్మీ మిట్టల్‌ 18.5 బిలియన్‌ డాలర్ల సంపదతో 62వ స్థానం, శివ నాడర్‌ 14.6బిలియన్‌ డాలర్ల సంపదతో 98వ స్థానంలో ఉన్నారు.

- Advertisement -