డిగ్రీ కాలేజ్‌ దర్శకుడిపై జీవిత ఆగ్రహం..

347
jeevitha rajashekar
- Advertisement -

డిగ్రీ కాలేజ్ లర్ లాంచ్ చేయడానికి వెళ్లిన మా ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ ఆ దర్శకుడికి క్లాస్ పీకారు. టాలీవుడ్ ఇండస్ట్రీ తలదించుకునేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. శృంగారం ఎక్కడపడితే అక్కడ చేయలేం కాదా..ఆలోచించి సినిమాలు తీయాలంటూ హితవు పలికారు.

ప్రతి వ్యక్తి జీవితంలో శృంగారం ఉంటుంది అలా అని ఎక్కడ పడితే అక్కడ సెక్స్ చేయలేం కదా అని ప్రశ్నించారు. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో బట్టలు విప్పుకోవడం,సెక్స్ చేసుకోవడం కామన్‌గా చూపిస్తున్నారంటూ మండి పడ్డారు

దర్శకుడు నరసింహ నంది చాలా కష్టపడి ఈ సినిమా తీసి ఉంటారు. మీరు ఎవరూ నష్టపోకుండా ఈ సినిమా కాపాడాలని కోరుకుంటున్నానని కోరారు. ఈ సినిమా ట్రైలర్ చూశాక చాలా రాంగ్ పర్సన్‌ని ఈ ఈవెంట్‌కి పిలిచారనిపించింది. నేను సెన్సార్ బోర్డ్ చీఫ్‌తో పాటు కేంద్ర సెన్సార్ బోర్డ్ మెంబర్‌ని. మీకు ఈ ట్రైలర్ సెన్సార్ కాలేదనుకుంటానని తెలిపారు.

RX 100, అర్జున్ రెడ్డి పుణ్యమా అని తెలుగు సినిమాలో లిప్ లాక్ లేకపోతే సినిమా లేకుండా పోయిందన్నారు. కాలేజ్ నేపథ్యంలో సినిమా అంటే లిప్ లాక్‌, మేక్ ఔట్ లేకుండా సినిమా తీయకూడదనే పరిస్థితికి తెలుగు సినిమా ఇండస్ట్రీ దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -