ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ..

60
modi

న్యూ ఢిల్లీ లో ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం… శుక్ర‌వారం సాయంత్రం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై ప్రధానితో చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల‌తో పాటు కృష్ణా, గోదావ‌రి బోర్డుల గెజిట్‌ ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

ఈ నెల 1వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. సెప్టెంబర్ 2న మ‌ధ్యాహ్నం 1:48 గంట‌ల‌కు వ‌సంత్ విహార్‌లో తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యనేతలు పాల్గొన్నారు.