జీవితా రాజశేఖర్ దంపతులకు బెయిల్..

57
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి,ఆయన బ్లడ్ బ్యాంక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటి జీవిత రాజశేఖర్ దంపతులకు బెయిల్ లభించింది. ఈ కేసులో జీవిత రాజశేఖర్ దంపతులకి ఏడాది జైలు శిక్ష అలాగే రూ. 5000 జరిమానా విధించింది. తీర్పు నివ్వడంతో పాటు బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించగా తర్వాతి బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది న్యాయస్థానం. ఈ మేరకు నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది.

Also Read:ఏపీలో కాంగ్రెస్ స్కెచ్ అదే?

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ 2011లో దాఖలు చేసిన కేసులో ఈ మేరకు తీర్పునిచ్చింది. చిరంజీవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మరియు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని దాతల నుండి విక్రయించారని ఆరోపించారు జీవిత రాజశేఖర్ దంపతులు. ఇది పెద్దదుమారం రేగగా అపట్లో చిరు- జీవిత,రాజశేఖర్ మధ్య గ్యాప్ కూడా పెరిగింది.

Also Read:సమ్మె వీడి విధుల్లో చేరండి:హరీశ్ పిలుపు

- Advertisement -