నట్టి కుమార్ వ్యాఖ్యలపై జీవిత రాజశేఖర్

43
- Advertisement -

సెన్సార్ బోర్డు నుండి తనను తప్పించాలని నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు నటి జీవితా రాజశేఖర్. తాను ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నానని…వైసీపీకి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. పలు గ్రూపుల్లో సర్య్కులేట్ అవుతున్న ఫోటోలు చాలా సంవత్సరాల క్రితంవి అన్నారు.వ్యూహం అనే సినిమా ఆర్ సి వచ్చినప్పుడు అన్ని సినిమాలు చూసినట్టుగానే ఆ సినిమాను కూడా చూస్తాను. నాకు ఇంకా ఆఫీస్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అన్నారు. నా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని తెలిపారు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రాన్ని ప్రాంతీయ సెన్సార్ బోర్డు ఇటీవల తిరస్కరించింది. సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ముందుకు ఈ సినిమా వెళ్లగా ఈ రివైజింగ్ కమిటీలో నటి జీవితా రాజశేఖర్ సభ్యురాలిగా ఉన్నారు. దీంతో ఆమెను తప్పించాలని డిమాండ్ చేశారు నట్టి కుమార్.

వ్యూహం పూర్తిగా జగన్‌కు అనుకూలంగా ఉందని ఇందులో చంద్రబాబు, సోనియా, పవన్ కల్యాణ్ ల డూప్ లను పెట్టి చిత్రీకరించారని మండిపడ్డారు.

Also Read:తెలంగాణ పప్పు రేవంత్…భారత్ పప్పు రాహుల్

- Advertisement -